లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం- ఇనుగుర్తి
మహబూబ్ బాద్ జిల్లా కేసముద్రం మండలానికి 11 కి మీ దూరం లో ఉన్న ఇనుగుర్తి గ్రామనికి చరిత్ర పరంగా యెంతో ప్రముక్యత ఉంది . కాకతీయుల కాలం లో ఈ గ్రామానికి యెంతో విశేషత్ ఉండేది. ఈ గ్రామం లోనే ప్రసిద్ధి చెందిన గుంటి చెరువు ఉంది .గ్రామం లో వెలసిన ప్రసిద్ద క్షేత్రం లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం . ఇ దేవాలయాన్ని కాకతీయుల కాలం లో కట్టించారని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది .
ఇనుగుర్తి కొండపైన ఒక లక్ష్మీనరసింహ ఆలయం కొండ దిగువన మరొక లక్ష్మీనరసింహ ఆలయం కొలువై ఉన్నాయి.
ఆలాయం లో కొలువైన లక్ష్మి నరసింహ స్వామి దివ్యమంగల రూపం చూడడానికి రెండు కళ్ళు సరిపోవా అన్న విదంగా ఉంటాయి .ఆలయం లో స్వామి వారి తో పాటు ఆల్వార్లు కూడా కొలువై ఉన్నారు .
ప్రతి నిత్యం జరిగే పూజా కార్యక్రమాల తో పాటు,ధనుర్మాసం, పండుగలు,విశేష పర్వదినాలలో విశేషమైన పూజలు నిర్వహించబడుతాయి.
ఏలా వెళ్ళాలి : మహబూబ్ బాద్ నుండి 20 కి మీ దూరం కేసముద్రం అక్కడి నుండి 11 కి మీ దూరం ఇనుగుర్తి