Velchal Lakshmi Narasimha swamy temple, Velchal, Vikarabad dist, telangana
సాధారణంగా గుడికి వెళ్లి ప్రశాంతంగా రెండు నిమిషాలు దేవుడిని తలుచుకొని ..ధ్యానం చేయడానికి సమయం,శ్రద్దా,భక్తి లేని రోజులు ఇవి!
అలాంటిది ఒక సామాన్య మానవుడే కొండను తొలిచి కోవెలగా తిర్చిదిద్దాడు.సంవత్సరాల తరబడి దేవుడి ద్యాసతోనే పని చేస్తూ దేవుని ధ్యాసలో కష్టాన్ని అంతా మరిచిపోయి తన లక్ష్యం,భగవదాజ్ఞ ను నెరవేర్చాడు.. చుసిన వారందరికి అబ్బుర పరిచే మానవుని కళా చాతుర్యమే ఈ దేవాలయం .
ఇందుగలడని సందేహము లేదు ఎందెందు వెతికిన అందు గలడు ఆ శ్రీమ్మన్నారాయణుడు.. భక్తులు భక్తితో పిలిస్తే ఏ రూపంలో అయిన,ఏ చోట అయిన దర్సనమిస్తారు..సృష్టి అంత అయిన లీలలే!
41 సంవత్సరల క్రితం దట్టమైన అడువులు,కొండతో ఉన్న ప్రాంతాన్ని ఒక సాదారణ భక్తుడు తొలిచి ఈ మహా క్షేత్రాన్ని నిర్మించారు !!
మోమిన్పేట్ మండల కేంద్రం లో ఉన్న వేల్చాల్ గ్రామం లో వెలసిన ఈ మహా పుణ్య క్షేత్రం లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం.
ప్రతి ఒక్కరు తప్పకుండా షేర్ చేయండి.. ఇ క్షేత్ర మహాత్యం అందరికి తెలియ చేయండి.మనుషుల్లోన దేవుడు ఉన్నాడు అనడానికి ఇ క్షేత్రమే నిదర్శనం!